కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ నా సోదరి మహ్మద్‌ కరీమున్నీసా ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసింది. నిన్ను శాసనమండలికి హాజరై రాత్రి ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది’ అని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)