ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల్లో మంచి పెరు తెచ్చుకోవాలని, కొవ్వెక్కి మాట్లాడొద్దని హితవు పలికారు. ‘ఎమ్మెల్యే ఉసిగొల్పితే..గుప్తా అనే వ్యక్తి చొక్కా విప్పి కొట్లాటకి దూకుతున్నాడు. ఎమ్మెల్యే నా కొవ్వు దించుతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తన నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

చేతనైతే నిరూపించు. నేను తెగించి ఉన్నా.. దేనికైనా సిద్ధమే. ఒంగోలులో అసలు ప్రజాస్వామ్యం ఉందా. కొంతమంది చొక్కాలు విప్పి విర్రవీగుతున్నారు. నన్ను కావాలని ఇరిటేట్‌ చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలుతున్నాడు. నాకు 1973లోనే కారు ఉంది. ఎమ్మెల్యే జనార్దన్ అధికార మదంతో ఉన్నాడు’అని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హవాలా చేశానని, భూకబ్జాలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... తనపై వస్తున్న అన్ని ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కోరుతున్నానన్నారు.  వీడియో ఇదిగో, మనం ఇంకో 3 సార్లు కలిస్తే ఇద్దర్నీ గే అంటే ఏం చేస్తావ్, జర్నలిస్టుకు కౌంటర్ విసిరిన విజయసాయి రెడ్డి

రాష్ట్ర మంత్రిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాలినేని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా? అని ప్రశ్నించారు. తన కొడుకుతో తిరిగే వాళ్లను గంజాయి బ్యాచ్ అంటున్నారని మండిపడ్డారు. ప్రశ్నించడం తన నైజమని... జగన్ కరెక్ట్ గా చేయనప్పుడు కూడా తాను ప్రశ్నించానని బాలినేని అన్నారు. దీనివల్ల తాను ఇబ్బందులు కూడా పడ్డానని చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)