బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గతంలో ఫిర్యాదు చేశారు షష్టి వర్మ.

జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తి కాల్ రికార్డు లీక్ చేశాడని షష్టి వర్మ(Choreographer Shashti Varma) ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడుతున్నాడని ఆరోపణలు... BNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు పోలీసులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు..వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం, వీడియో ఇదిగో

మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు , కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రాఘవేంద్రరావుకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 Another case registered against Bigg Boss fame Shekhar Basha 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)