గురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్నారు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.

అలాగే మెనూ ప్రకారం పప్పు వండాల్సి ఉండగా నీళ్ల సాంబార్ వండారు వంట కూలీలు. అడిషనల్ కలెక్టర్ వస్తున్నాడని కొన్ని గుడ్లు ఉడికించగా అవి కుళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు ఇప్పటివరకు యూనిఫాంలు ఇవ్వలేదు.. చలికాలం ప్రారంభమైనా ఇప్పటికీ బ్లాంకెట్లు అందలేదు. దీంతో గురుకులం తనిఖీలో విస్తూ పోయే నిజాలు చూసి ఖంగుతిన్నారు అడిషనల్ కలెక్టర్.   వీడియో ఇదిగో, వాంటో సుట్‌కేస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)