Hyderabad, Sep 6: హైదరాబాద్ (Hyderabad) ఈస్ట్ జోన్ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల (Fancy Number) బిడ్డింగ్ లో (Bidding) సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్ ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర పలికింది. టీఎస్11ఈజడ్ 9999 నెంబర్‌ను రూ.9,99,999కు చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకున్నదని అధికారులు తెలిపారు. టీఎస్11ఎఫ్‌ఏ 0001 నంబర్‌ను 3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు కైవసం చేసుకొన్నాడని పేర్కొన్నారు. అదే సిరీస్‌తో 0011 నంబర్‌ను శ్యామల రోహిత్‌రెడ్డి రూ.1.55 లక్షలకు దక్కించుకొన్నారని తెలిపారు. మొత్తంగా ఆర్టీఏ ఖాజానాకు రూ.18 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆయన తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)