దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) - కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్దం నెలకొంది.

దీంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ వ్యాప్తంగా ENO హోర్డింగ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. రూ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా ? అయితే ENO వాడండి అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో

హోర్డింగ్లు ఏర్పాటు చేయగా ఇది చర్చనీయాంశంగా మారింది.

దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు (Amazon Web services to invest Rs 60,000 crore) అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది.   హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్, భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 

Congress Leaders Put Up ENO Hoardings on Targeting KCR and KTR

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)