రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 8 గంటల వరకే రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, షాపులకు అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత ఎక్కడైనా షాపు ఓపెన్ చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, డయోగ్నస్టిక్, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
Imposition of night curfew from 9.00PM to 5.00AM in #Telangana till 30th April 2021
Kindly adhere and be safe pic.twitter.com/QW2AnDGP7u
— Swati Lakra (@SwatiLakra_IPS) April 20, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)