తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిసారు. టి 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను ముఖ్యమంత్రి అభినందించారు. టీమిండియా జెర్సీ ని సీఎం రేవంత్ రెడ్డి కి సిరాజ్ బహుకరించారు. టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించిన సంగతి విదితమే. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అతనికి క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి ఇటీవలి T20 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్ సిరాజ్ మాత్రమే.  వీడియో ఇదిగో, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో బ్రహ్మరథం పట్టిన క్రికెట్ అభిమానులు

Here's Congress Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)