Hyderabad, March 18: వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accidents) జంట నగరాల్లో (Twin Cities) కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న స్వప్నలోక్ లో (Swapnalok) జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఆహుతయ్యారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో (Rajendranagar) మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాస్త్రిపురంలోని ఓ తుక్కు గోదాంలో వ్యర్థ పదార్థాలు తగలబడతున్నాయి. ఈ మంటల్లో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
రైల్వే ప్లాట్ ఫాంపై కారు చక్కర్లు.. రీల్స్ కోసం వింత చేష్టలు.. ఆగ్రా వ్యక్తిపై కేసు నమోదు.. వీడియోతో
రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం #Rajendranagar #FireAccident #Hyderabad https://t.co/zWDIOPmzLb
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)