భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారియింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి.. సాయంత్రం కాగానే వర్షం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మొదలైన వాన ఇంకా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, బేగంపేటలో భారీ వర్షం పడింది. విపరీతంగా వాన పడటంతో.. వరద నీటితో.. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వరద రోడ్ల మీద భారీగా చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)