భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఒవైసీ- మిధాని కూడళ్లలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల మేర ఈ పైఓవర్‌ను నిర్మించారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా పైవంతెన నిలవనుంది. ముఖ్యంగా పాతబస్తీ నుంచి ఎల్బీనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్‌నగర్, సాగర్ రింగ్‌రోడ్, ఎల్బీనగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ పైవంతెన ద్వారా చాంద్రాయణగుట్ట, కర్మాన్‌ఘాట్ మార్గాల ద్వారా వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.
Ministers @KTRTRS, @mahmoodalitrs & @SabithaindraTRS inaugurated the flyover at Owaisi-Midhani Junction in Hyderabad. pic.twitter.com/D6ghQNRVbC
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 28, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)