తెలంగాణ మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై మాజీ హోం మినిస్టర్ మహమూద్ అలీ కింద పడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)