వేసవి కాలంతో పాటుగా మామిడి పండ్లు సీజన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు సరికొత్త దందాకు తెరతీసారు. ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే హానికరమైన రసాయనాలతో కృత్రిమంగా పండిన మామిడి పండ్లను వ్యాపారులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో రసాయనిక మామిడి పండ్ల రాకెట్ గుట్టు రట్టయింది. నగరంలో టాస్క్ ఫోర్స్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకుని ఒడిషా నుండి హైదరాబాద్‌కు, యువకుడిని మాటు వేసి పట్టుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..

ఈ తనిఖీల్లో భాగంగా వ్యాపారులు హానికర రసాయనాలతో మామిడి పండ్లను విక్రయిస్తున్నట్లు తేలింది. అధికారులు ఐదుగురు వేర్వేరు పండ్ల విక్రయదారులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 12.61 లక్షల విలువైన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు.పండ్ల విక్రయదారులకు కౌన్సెలింగ్ చేసి, పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నట్లు తేలితే శిక్షించబడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఫుడ్ సేఫ్టీ వివిధ విధానాలను కూడా సూచించింది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)