హైదరాబాద్ నగరాన్నిభారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. తాజాగా రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో ఆగిపోయాయి.ఒక బస్సు ఆరామ్‌ఘర్ ప్రాంతంలో చిక్కుకోగా, మరొకటి శ్రీనగర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (GHMC DRF) బృందాలు నీటిలో చిక్కుకున్న రెండు RTC బస్సులను ముందుకు నెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రయాణీకుల భద్రత మరియు బస్సులను తొలగించడం, ట్రాఫిక్ అంతరాయాలు మరియు ప్రమాదాలను తగ్గించడంలో బృందాలు సమర్ధవంతంగా పనిచేశాయి.
Here's Videos
A RTC bus that was stuck in water at Aramgarh and another RTC bus that was stuck in water at Srinagar area due to #waterlogged after heavy rains, those were removed by traffic police and GHMC DRF teams.#HyderabadRains #Hyderabad #HeavyRains pic.twitter.com/RTMZa6QgNx
— Surya Reddy (@jsuryareddy) September 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)