హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని కలిశారు సద్గురు జగ్గీ వాసుదేవ్. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌ను కలిసి కలిశారు(Jaggi Vasudev Meets CM Revanth Reddy). ఈ సమావేశంలో సద్గురు, రేవంత్ రెడ్డితో అనేక సామాజిక, ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. సీఎం రేవంత్‌ను మహా శివరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలి.. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిశారు కేటీఆర్. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీల బాధ్యతను రాష్ట్ర గవర్నర్ల ద్వారా కేంద్రం నియంత్రించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అన్నారు.
Isha Foundation founder Jaggi Vasudev meets cm revanth reddy
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ గారు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన @SadhguruJV గారు ఈశా ఫౌండేషన్ కొనసాగిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వివరించారు. @ishafoundation pic.twitter.com/8Odv6MLWBP
— Telangana CMO (@TelanganaCMO) February 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)