KTR Meets Central Ministers Nitin Gadkari and Dharmendra Pradhan(X)

Delhi, Feb 6:  పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలి.. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిశారు కేటీఆర్. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీల బాధ్యతను రాష్ట్ర గవర్నర్ల ద్వారా కేంద్రం నియంత్రించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అన్నారు.

యూజీసీలో 'No Suitable Candidate Found (NSF)' అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం వల్ల అర్హత కలిగిన దళిత, గిరిజన, బహుజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ నిబంధనను తక్షణం సవరించాలని కోరాం అన్నారు.

నేషనల్ హైవే 365B రోడ్డును సిరిసిల్ల నుండి కోరుట్ల దాకా పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని కలిసి విజ్ఞప్తి చేశాం అన్నారు. ఈ రోడ్డును పొడిగిస్తే వేములవాడ రాజన్న స్వామి ఆలయం, ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలకు కనెక్టివిటీ పెరిగి, టెంపుల్ టూరిజం పెరుగుతుందని కోరినం - కేటీఆర్ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వారి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల విషయంపై మా న్యాయవాదులను ఇవాళ కలుస్తున్నాము అన్నారు.  గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా... ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, టీమిండియా తరపున రాణించాలని ఆకాంక్ష

దీన్ని ఇంకా త్వరగా చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి.. ఏ విధంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడాలని చర్చిస్తాం అన్నారు. యుజిసి నిభంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాం.. యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి అన్నారు.

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ కి భాద్యతలు ఇవ్వడం సరికాదని తెలిపామని...విసిలుగా నిష్ణాతులుగా ఉండాలని సూచించాం అన్నారు. గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే విధంగా మార్పులు చేస్తున్నారు.. నో సుటబుల్ కండిడేట్ నిబంధన రాజ్యంగ విరుద్ధంగా ఉందన్నారు.