Hyderabad, Oct 30: ఉల్లి ధరలు (Onion Prices) సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి, ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది. హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లలో కిలో రూ.60-రూ.80కి విక్రయిస్తున్నారు. దీపావళి (Deepawali) పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. 15 రోజులుగా, నిల్వ ఉంచిన ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40% తగ్గాయని అంటున్నారు. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
#Hyderabad onion prices in retail market range from Rs 60 to Rs 80 per kg #OnionPrice https://t.co/3hhsx7fD4c
— Kaniza Garari (@KanizaGarari) October 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)