ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లిపోయిన సంగతి విదితమే. దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్‌(2) డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో నేడు వేలానికి ముహూర్తం నిర్ణయించారు. తాజాగా పందెం కోడి యజమాని బయటకు వచ్చాడు. ఓ వీడియో ద్వారా వేలం ఆపాలని టీఎస్ఆర్టీసీ ఎండీకి విన్నవించుకున్నారు. ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి.. కోడి తమదని మూడు రోజులు గడిచినా ఎవరూరాని వైనం.. నేడు వేలం వేయనున్న ఆర్టీసీ అధికారులు (వీడియోతో)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)