నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. నేరుగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన సందర్శకుడు అరవడంతో అప్రమత్తమైన జూ సిబ్బంది చాకచాక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. జూ అధికారులు, బహదూర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయి కుమార్ (31) జూపార్కును సందర్శించడానికి టికెట్టు తీసుకొని జూలోకి వెళ్లాడు.
తోటి సందర్శకులు, జూ సిబ్బంది కళ్లు కప్పి సింహం ఎన్‌క్లోజర్ కొండచరియల గోడపైకి ఎక్కాడు. దీంతో అప్రమత్తమైన జూ యానిమల్ కీపర్, సిబ్బంది అతడిని పట్టుకున్నారు. సాయి కుమార్ తిరుమలగిరి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా రోడ్లపై నివాసముంటున్నట్లు బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... వాటి కోసమే సింహం దగ్గరకు వెళ్లానని చెప్పాడని, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు పేర్కొన్నారు. సాయి కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Telangana: A 31-year-old man who went close to an African lion moat area at Nehru Zoological Park in Hyderabad was rescued by the zoo authorities and handed over to police earlier today pic.twitter.com/Xo4G7gL7pN
— ANI (@ANI) November 23, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)