భాగ్యనగరంలో కరోనా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్- లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో 36 సర్వీసులను నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 23 వరకు 38 సర్వీసులను ఇది వరకే రద్దు చేసిన రైల్వే.. నేటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. రద్దు చేసిన రైళ్లలో రెండింటిని మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక రద్దయిన సర్వీసుల్లో హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న 18 రైళ్లు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడుస్తున్న 16 రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న రెండు రైళ్లు ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)