తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నోట్లకట్టలతో వెళుతున్న సీఐ కారును ఆపి, సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఓ కార్యకర్త సీఐ చెంప చెళ్లుమనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల సమీపంలో ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
కారులో నోట్ల కట్టలు తరలిస్తున్న వ్యక్తి వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావు అని సమాచారం. క్లాత్ బ్యాగ్ లో నోట్ల కట్టలతో పాటు పోలీస్ ఐడెంటిటీ కార్డు కూడా ఉండడం వీడియోలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు.. డబ్బు సంచీతో పాటు కారును కూడా సీజ్ చేశారు. కాగా, ఈ డబ్బు మంత్రి మల్లారెడ్డిదేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Heres' Video
Anjani.Anjith Rao inspector #Warangal #Prohibitionexcise was cought by local youth while carrying Rs6 lakhs in his car2 distribute 2 #voters in #Warangal. @HiWarangal @warangalfacts @Warangal @cpwarangal @Collector_WGL @ECISVEEP @SpokespersonECI @AmitLeliSlayer @revanth_anumula pic.twitter.com/VVE2mTL9S4
— R V K Rao_TNIE (@RVKRao2) November 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)