తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్‌ రెడ్డిని షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు పెండ్లి పత్రికను రేవంత్‌ రెడ్డికి అందించారు.వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డితో ఈ నెల 18న అట్లూరి ప్రియ నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద షర్మిల తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. వైఎస్సార్‌ ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)