తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నాకు దిగారు.ఆదానికి వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారంటూ డిమాండ్ చేస్తూ వారు SBI ముందు నిరసనలు చేపట్టారు. ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి వేల కోట్ల రుణాన్ని ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఇచ్చారని.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్‌బీఐ ముందు సోమవారం ఉదయం ఆయన నిరసనకు దిగారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రూ.30 వేల కోట్ల రుణాన్ని మోదీ స్నేహితుడు అదానీకి రాజకీయ పలుకుబడితో ఎస్‌బీఐ కట్టబెట్టిందని ఆరోపించారు. దేశంలోని 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని చెప్పారు. ఎస్‌బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చండంటూ ఎద్దేవా చేశారు. ఎల్ఐసీని కూడా అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా మార్చాలన్నారు.హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నా నిరసనలు చేపట్టారు.
Here's ANI Tweet
Telangana| Congress stages protest outside SBI office in Hyderabad over Adani row pic.twitter.com/s24b6yOKnV
— ANI (@ANI) February 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)