కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా నగరంలోని ఈడీ ఆఫీస్ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు(Telangana congress leaders) నిరసనకు దిగారు. మోడీ హటావో , దేశ్ బచావో అంటూ నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, మధుయాష్కీ , అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య(Ponnala laxmaiah), షబ్బీర్ అలీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నిరసనతో బషీర్ బాగ్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం దగ్గర ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు.
Telangana | Congress workers torched a two-wheeler near the ED office in Hyderabad today as they protested over the questioning of the party's interim president Sonia Gandhi by the agency in Delhi. pic.twitter.com/hghyMW8oV7
— ANI (@ANI) July 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)