Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌ తన సత్తా చాటుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆశ్వారావుపేటలో, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందులో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలిచారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు.  ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు, రేవంత్ రెడ్డితో భేటీ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వీడియో ఇదిగో..

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)