హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు తెరవడంతో.. మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మూసీని ఆనుకొని ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిషన్‌బాగ్ పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు, విపత్తు నిర్వహణ బృందలు, పోలీసులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 17,250 క్యూసెక్కులు వస్తుండగా.. ప్రాజెక్టు నుంచి 17,250 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642.50 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.81 టీఎంసీలు ఉంది.
Here's Video
#MusiRiver at Sangem village, Choutuppal(M) under @SiValigonda Police station is overflowing, Citizens are advised to use alternative routes.@TelanganaCOPs @DcpBhongir @AcpChoutuppal @ChoutuppalTrfPS @way2_news#HeavyRains #HyderabadRains #StayAlert #StaySafe #HeavyRainfallAlert pic.twitter.com/ycwfWqQ93p
— Rachakonda Police (@RachakondaCop) July 27, 2023
Water level increasing in the #MusiRiver at #MoosarambaghBridge, after 2 flood gates of #HimayatSagar and 2 flood gates of #OsmanSagar (#Gandipet) have been lifted, @insptr_malakpet continuously monitoring the water level.#HyderabadRains #HYDERABAD #TelanganaRains #HeavyRains pic.twitter.com/ydrTWBubUL
— Surya Reddy (@jsuryareddy) July 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)