హన్మకొండ - నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గాజ కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన చిన్న కూతురు శ్రీవిద్య గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది. ఇటీవల సప్లమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేదు. దీంతో తండ్రి కూతురిని మందలించాడు. అసలే పరీక్షల్లో పాస్ కాకపోవడం, తండ్రి కోపం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై శ్రీవిద్య ఇంట్లో ఉన్న పురుగులమందు తాగింది.

ఆమెను వెంటనే పరకాల ఆస్పత్రికి తరలించారు. అయితే తన వల్లే కూతురు ఆత్మహత్యకు యత్నించిందని భావించిన కుమారస్వామి పరకాలలోని ఫెర్టిలైజర్ షాపులో పురుగులమందు తీసుకుని కంఠాత్మకూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్లి మందు తాగి మృతి చెందారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.  ఆరేళ్ల కొడుకు లావుగా ఉన్నాడని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించిన తండ్రి, పరిగెత్తుతూ మృతి చెందిన బాలుడు, వీడియో ఇదిగో..

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)