తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసు క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌న నిర్మాణం పూర్తయ్యింది. ఈ భ‌వ‌నాన్ని గురువారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ భ‌వ‌నం ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌... ఆ భ‌వ‌నం ప్రాధాన్యాన్ని వివ‌రిస్తూ బుధ‌వారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ స‌మీకృత క‌మాంట్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ (టీఎస్‌పీఐసీసీసీ) పేరిట నిర్మించిన ఈ భ‌వనం ప్ర‌పంచ శ్రేణి ప్ర‌మాణాల‌తో నిర్మించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌భుత్వ భ‌వ‌నంగా దీనికి గుర్తింపు ల‌భించ‌నుంది అని ఆయ‌న పేర్కొన్నారు. గురువారం ఈ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)