మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్‌ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు.దీంతో స్పందించిన టీఎస్‌ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది.

ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్‌, సిటీ మఫిసిల్‌ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov. లేదా మొబైల్‌ నంబర్‌: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్‌ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది.

Here's Sajjanar tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)