మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని ఆయన స్వయంగా వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్‌ చేశారు. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. తాను పూర్తిస్థాయిలో కరోనా టీకాలు తీసుకున్నానని వెల్లడించారు.కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందజేసింది. అదేవిధంగా యాంటీవైరల్ జనరిక్‌ కరోనా పిల్స్‌ను సరఫరా చేసేందుకు తన ఫౌండేషన్ తరపున 120 మిలియన్ల డాలర్లను బిల్‌గేట్స్‌ వెచ్చించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)