అమెరికన్ బిగ్ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ సెంటర్‌లో సుమారు 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పురోగతిపైనా సత్యనాదెళ్లతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ యూనివర్సిటీపై చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Satya Nadella Meets CM Revanth Reddy

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)