ఖ‌ర్చులు త‌గ్గించే ఉద్దేశంతో బ్రిట‌న్‌కు చెందిన బీటీ గ్రూపు(BT Group) 55 వేల మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ది. 2030 వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నున్న‌ట్లు చెప్పింది. బ్రిటీష్ టెలికామ్స్ అండ్ టెలివిజ‌న్ గ్రూపు బీటీలో సుమారు 42 శాతం సిబ్బందిని త‌గ్గించ‌నున్నారు. బ్రిట‌న్‌కు చెందిన మ‌రో మొబైల్ కంపెనీ వోడాఫోన్ రెండు రోజుల క్రితం భారీ లే ఆఫ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రానున్న మూడు ఏళ్ల‌లో ఆ కంపెనీ 11వేల ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ది. బీటీ సంస్థ‌లో సుమారు ల‌క్షా 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

దీంట్లో కాంట్రాక్ట‌ర్లు కూడా ఉంటారు. రానున్న అయిదు నుంచి ఏడు ఏళ్ల స‌మ‌యంలో.. బీటీ కంపెనీ త‌మ ఉద్యోగుల సంఖ్య‌ను 75 వేల నుంచి 90 వేల వ‌ర‌కు కుదించ‌నున్న‌ది. ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌, 5జీ నెట్వ‌ర్క్ సేవ‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మెయింటేనెన్స్ కోసం ఎక్కువ మంది సిబ్బంది అవ‌స‌రం లేద‌ని బీటీ సంస్థ తెలిపింది. గ‌త వార్షిక సంవ‌త్స‌రంలో సంస్థ నిక‌ర లాభం 50 శాతం పెరిగిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)