దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ నంబియర్‌ తన పదవికి రాజీనామా చేశారు. నాస్కాం ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో ఆయన కాగ్నిజెంట్‌కు రాజీనామా చేశారు. దీంతో కాగ్నిజెంట్‌ గ్లోబల్‌ హెడ్‌గా పదొన్నతి పొందిన రాజేశ్‌ వారియర్‌కు అదనంగా ఇండియా సీఎండీగా బాధ్యతలు అప్పగించింది.వచ్చే నెల 2న గ్లోబల్‌ హెడ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న రాజే శ్‌..అక్టోబర్‌ 1 నుంచి సీఎండీగా వ్యవహరించనున్నారు.రాజేశ్‌..ఈవీపీ, ఇన్ఫోసిస్‌లో విధులు నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్‌ బిజినెస్‌ డిజిటల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)