టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వేళ చిప్ దిగ్గజం ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఇంటెల్ తాజా నిర్ణయంతో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్‌సింగర్‌ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధిస్తారు. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది. సంస్థ భవిష్యత్తుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)