జియో ఓటీటీ ప్రియుల‌కు సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.  యూజర్లకు అందుబాటు ధ‌ర‌లో రెండు కొత్త ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్స్‌ను తీసుకువ‌చ్చింది. కొత్త‌గా తీసుకొచ్చిన వాటిలో రూ. 29, రూ. 89 ప్లాన్స్ ఉన్నాయి. కేవ‌లం రూ. 29కే నెల మొత్తం 4కే వీడియో క్వాలిటీతో యాడ్‌ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే, ఈ ఆఫ‌ర్ ఒక్క డివైస్‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఒకేసారి నాలుగు డివైస్‌ల‌కు కావాలంటే మాత్రం రూ. 89 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.

నెల‌కు కేవ‌లం రూ. 29 చెల్లిస్తే చాలు.. ఎలాంటి యాడ్స్ లేకుండా 4కే క్వాలిటీతో వీడియో కంటెంట్‌ను చూడొచ్చు. అలాగే డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ వీక్షించ‌వ‌చ్చు. జియో సినిమాలో వ‌చ్చే కంటెంట్‌ను స్మార్ట్ టీవీ లేదా డివైజ్‌లోనూ చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే, ఒక స‌మ‌యంలో ఒకే డివైస్‌లో మాత్ర‌మే వీక్షించే అవ‌కాశం ఉంటుంది. గ‌తంలో దీని ధ‌ర రూ. 59గా ఉండేది. ఇది ఫ్యామిలీ ప్లాన్‌. కుటుంబాలను ఆకర్షించేందుకు గానూ జియో సినిమా రూ. 89 ప్లాన్‌ను తీసుకొవచ్చింది. ఇది ఒకసారి రీఛార్జ్‌ చేస్తే నెల మొత్తం నాలుగు డివైజుల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. రూ.29 ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు దీనికి కూడా వర్తిస్తాయి. గతంలో దీని ధర నెలకు రూ.149గా ఉండగా.. ఇప్పుడు రూ.89కి తగ్గించారు.

Here's VIdeo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)