ఇంటర్నెట్ యూజర్లతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 60 లక్షల మంది డేటా తస్కరణకు గురైందని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల రీసెర్చర్లు వెల్లడించినట్లు ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఇలా సైబర్ మోసగాళ్లు సేకరించిన డేటా అంతా ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే సెక్యూర్ పేజీలో ఉందని చెప్పారు.

చైనా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డ్ ఇన్, ఎక్స్ డాట్ కామ్, టెలిగ్రామ్‌తోపాటు ట్విట్టర్, డ్రాప్ బాక్స్ వంటి వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజర్ల నుంచి ఈ డేటాను సైబర్ మోసగాళ్లు తస్కరించారని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల పరిశోధకులు తెలిపారు.ఈ డేటా బేస్‌ను ఒక డేటా బ్రోకర్ గానీ, ఒక సైబర్ ఫ్రాడ్‌స్టర్ గానీ కంపైల్ చేసి ఉంటారని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)