Newyork, Feb 25: వీర్య కణాలు (Sperm Cells) తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబసభ్యులకు క్యాన్సర్ ముప్పు (Cancer Risk) ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తయ్యే లేదా అసలు ఉత్పత్తి కాని పురుషుల కుటుంబ సభ్యుల ఎముకలు, కీళ్లలో క్యాన్సర్లు అభివృద్ధి చెందే ముప్పు 156% పెరుగుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఇలాంటి వారిలో లింఫ్ క్యాన్సర్ ముప్పు 60%, టిష్యూ క్యాన్సర్ ముప్పు 56%, థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ 54% పెరుగుతున్నట్టు వివరించారు. వృషణాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నదని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.
How is sperm count related to the risk of multiple cancers? Find out #healthcare #lifestyle https://t.co/xzZA3JtCGd
— NewsDrum (@thenewsdrum) February 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)