గత వారం ఫ్రాన్స్‌లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన వర్చువల్‌ సమావేశంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేతో కలిసి ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. మారిషస్‌లో రూపే కార్డులను సైతం ప్రారంభించారు.

శ్రీలంక, మారిషస్‌ ప్రజలతో భారత్‌కున్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ప్రారంభిస్తున్న యూపీఐ సేవలు చాలామందికి ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని కార్యాలయం (PMO India) ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌ నుంచి శ్రీలంక, మారిషస్‌కు వెళ్లేవారు ఇకపై యూపీఐతో చెల్లింపులు చేయొచ్చు.త్వరలో మారిషస్‌ బ్యాంకులు రూపే కార్డులనూ జారీ చేసే అవకాశం ఉంది. వాటిని ఆ దేశంతో పాటు భారత్‌లోనూ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)