ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్‌-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు 20 మంది దుర్మరణం చెందారని వార్తలు వస్తున్నాయి.తాలిబాన్‌ ప్రభుత్వం ఇంతవరకు ధ్రువీకరించలేదు.బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాబూల్లోని విదేశాంగ మంత్రిత్వశాఖ భవనం ఆవతల పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పినట్లు పోలీసు ప్రతినిధి ఖలీద్‌ జద్రాన్‌ తెలిపారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)