బంగ్లాదేశ్‌లో ఓ భవనంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. కాగా, పేలుడుకుగల కారణాలు తెలియరాలేదు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం చిట్టగాంగ్‌లోని ఓ ఆక్సిజన్ ప్లాంటులో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే ఈ ఘటన చోటు చేసుకుంది.
Here's Video
At least 7 people killed, over 70 people injured in an explosion at a building in Bangladesh's Dhaka: Local media #Dhaka #Bangladesh #DHAKABLAST pic.twitter.com/hbZLibPTrF
— DHIRAJ DUBEY (@Ddhirajk) March 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)