పశ్చిమ ఆఫ్రికాలోని నైరుతి బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం జరిగిన ఈ పేలుడు.. బంగారు గనిలో బంగారం తవ్వడానికి ఉపయోగించే రసాయనాల వల్ల సంభవించినట్లు తెలుస్తోంది.

రాజధాని ఔగాడౌగౌకి నైరుతి దిశలో 386 కిలోమీటర్ల (240 మైళ్ళు) దూరంలో ఉన్న గ్బోంబ్లోరాలోని గోమ్‌గోంబిరో గోల్డ్ ప్యానింగ్ సైట్‌లో కూడా శక్తివంతమైన పేలుడు భారీ మొత్తంలో వస్తు నష్టాన్ని కలిగించిందని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ AIB తెలిపింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. పత్తి తర్వాత బంగారం అగ్రగామిగా మారిన ఈ పశ్చిమ ఆఫ్రికా దేశంలో మైనింగ్ ప్రదేశాలలో అప్పుడప్పుడూ ఇలాంటిఈ విషాదాలు చోటు చేసుకుంటాయి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)