ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్న శ్రీలంవక అంతరించిపోతున్న ఓ రకం కోతులను చైనాకు ఎగుమతి చేసి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు రెడీ అయింది. తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక వెల్లడించింది.

టోక్ మకాక్‌’ కోతులను పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర తమ శాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం. టోక్‌ మకాక్‌’ జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి.ప్రస్తుతం శ్రీలంకలో టోక్‌ మకాక్‌ కోతుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు అంచనా.ఈ నేపథ్యంలో ఈ కోతులను చైనా నిజంగానే జూలో ప్రదర్శనకు ఉంచుతుందా? లేక వాటిపై ఏవైనా ప్రయోగాలు చేస్తుందా? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)