Newdelhi, Feb 7: చిలీ (Chile) దేశ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) (Sebastian Pinera) హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. మంగళవారం లాగో రాంకో టౌన్‌లో హెలికాఫ్టర్ కూలడంతో ఆయన మరణించారు. హెలికాఫ్టర్ లోని మిగతా ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడి మృతితో యావత్ దేశం శోక సంద్రంలో కూరుకుపోయింది. వివిధ దేశాధినేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. పినేరా రెండు సార్లు చిలీ దేశాధ్యక్ష పదవిని అధిష్టించారు. 2010-14, 2018-2022 మధ్య కాలంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు.
#Chile's former President #SebastianPinera has died, at the age of 74, when his private helicopter crashed in the south of the country, his office has confirmed.
(File Image: Sebastian Pinera) pic.twitter.com/dRAoIbXFTy
— IANS (@ians_india) February 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)