చైనాలో సోమవారం భారీ విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావొస్తున్నా ఇప్పటి వరకు సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరూ ఆచూకీ దొరకలేదు. ఘోర ప్రమాదం తర్వాత ఎవరూ సజీవంగా బతుకుతారనే ఆశలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి విచారణకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశించారు. దుర్ఘటన జరిగిన సమయంలో 132 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.

ఇప్పటి వరకు ప్రమాదంలో ఒక్కరు సైతం సజీవంగా కనిపించలేదు. విమానం పర్వత ప్రాంతంలో కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎంతగా ఉన్నాయంటే నాసా పంపిన ఉపగ్రహాల్లోనూ రికార్డయ్యేంత భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో పౌర విమానయాన రంగంలో భద్రతా ఏర్పాట్లను పరిష్టం చేయాలని చైనా అధ్యక్షుడు ఆదేశించారు. చైనా పౌర విమానయాన శాఖ నేతృత్వంలోని దర్యాప్తులో సహాయం చేసేందుకు తమ సాంకేతిక నిపుణుల బృందం సిద్ధంగా ఉన్నారని ఏరోస్పేస్ సంస్థ తెలిపింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం కున్మింగ్‌ నుంచి గ్వాంగ్‌జౌకు వెళ్తుండగా గ్వాంగ్జీలో కూలిపోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)