చైనాలో యునాన్ ప్రావిన్స్‌లోని గిరిజ‌న‌, ప‌ర్వ‌త ప్రాంతాల్లోని కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో 47 మంది స‌జీవ‌స‌మాధి అయ్యారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, విప‌త్తు ద‌ళాలు క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో 18 ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌ల‌ను అధికారులు తొల‌గిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న మృత‌దేహాల‌ను వెలికి తీస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 200 మంది పాల్గొన్నారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించేందుకు అంబులెన్స్‌ల‌ను సిద్ధంగా ఉంచారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)