ఆర్నేళ్ల త‌ర్వాత తొలిసారి చైనాలో మ‌ళ్లీ కరోనాలు మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. శ‌నివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వ‌ల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్న‌ది. చైనాలో ప్ర‌స్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోవిడ్ మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం ఆందోళ‌కరంగా మారింది.

దేశ రాజ‌ధాని బీజింగ్‌లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇక జీరో కోవిడ్ పాల‌సీని వ్య‌తిరేకిస్తూ చైనాలో నిర‌స‌న‌లు తీవ్రంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇంకా ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం లాక్‌డౌన్‌లో ఉన్నారు. కొంద‌రు పౌరుల్ని బ‌ల‌వంతంగా క్వారెంటైన్ చేశారు.బీజింగ్‌లో 2.1 కోట్ల జ‌నాభా ఉన్న విష‌యం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)