చైనాలో వేలాదిగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఇప్పటికే అనేక నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోగా, తాజాగా షాంఘై మహానగరంలోనూ లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, నిత్యావసర వస్తువులను తామే ఇళ్ల సమీపానికి చేరుస్తామని, అక్కడ్నించి ప్రజలు తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలు నిలిపివేయాలని, పరిశ్రమలు, కార్పొరేట్ ఆఫీసులు మూసివేయాలని ఆదేశించారు. షాంఘై నుంచి రాకపోకలపైనా ఆంక్షలు విధించారు.

సోమవారం నుంచి లాక్ డౌన్ (Shanghai launches two-phase lockdown) అని ప్రకటించడంతో, ప్రజలు నిన్న సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. దాంతో సూపర్ మార్కెట్లలోని సరుకు ఒక్కరోజులోనే ఖాళీ అయింది. షాంఘై జనాభా 2.6 కోట్లు. నిన్న ఒక్కరోజే 3 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు (Covid in China) వెల్లడయ్యాయి. దాంతో, నగరంలోని జనాభా అంతటికి కరోనా పరీక్షలు చేయాలని అధికార వర్గాలు నిర్ణయించాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)