మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని బయటకు వెళ్లగొట్టడంతో ఆగ్రహించిన ఓ మందుబాబు ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని సాన్ లూయిస్ రియో కొలరాడోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడ్ని విచారిస్తున్నామని సోనోరా అటార్నీ జనరల్ తెలిపారు.
బార్‌లో తప్పతాగి అక్కడున్న మహిళల పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించటంతో, అతడ్ని బార్ నుంచి వెళ్లగొట్టారు. దీంతో అతడు ఆ బార్‌కు నిప్పుపెట్టాడు.మృతుల్లో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉండగా, మరో ఆరుగురు కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన యొక్క వీడియోలో అగ్నిమాపక సిబ్బంది భారీ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చూడవచ్చు. ప్రజలు అరుస్తూ ప్రాణాల కోసం పరిగెత్తడం వీడియోలో కనిపించింది.
Here's Video
#Breaking #Sonora Check the level of violence. Man thrown out of the bar in Mexico sets the bar ablaze with a "molotov" cocktail, killing 11 people.
So far, the attacker has not been arrested.#Mexico #MexicoCity pic.twitter.com/AQdsfgkbat
— Insider Times (@Insider_Times) July 22, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)