అమెరికాలో ఫిలడెల్ఫియాలోని మూడు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం (Philadelphia Building Fire) సంభవించింది. దీంతో ఏడుగురు పిల్లలతో సహా సుమారు 11 మంది మృతి చెందారు. ఈ మేరకు నగరంలోని పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందిన నగరంలోని ఫెయిర్‌మౌంట్ పరిసరాల్లోని మూడు-అంతస్తుల భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బందికి సుమారు 50 నిమిషాల సమయం పట్టింది. అయితే భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ అవి విఫలమవ్వడంతోనే పిల్లలతో సహా 11 మంది (Eight children, four adults killed ) చెందారని ఫిలడెల్ఫియా ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
ఈ క్రమంలో ఎనిమిది మంది రెండు ఎగ్జిట్ మార్గాల గుండా ప్రాణాలతో బయటపడగలిగారని, మరణించిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారని ఫిలడెల్ఫియా డిప్యూటీ ఫైర్ కమిషనర్ క్రైగ్ మర్ఫీ వెల్లడించారు. ఇప్పటికి వరకు తాను చూసిన ప్రమాదాల్లో ఇదే అత్యంత భయంకరమైన అగ్ని ప్రమాదం అని మేయర్ జిమ్ కెన్నీ అన్నారు.
At least 13 people, including seven children, were killed following a deadly fire in a Philadelphia apartment building after smoke detectors failed to go off, the Philadelphia Fire Department said https://t.co/uKnfIW3oHy pic.twitter.com/nRLXdno0eE
— Reuters (@Reuters) January 5, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)