మధ్య ఆఫ్రికా దేశం కాంగోను (Congo) భారీ వర్షాలు వణికించాయి. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలోని కాంగో నదీ (Congo River) తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాల (Torrential rains) కారణంగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై మట్టిపెళ్లలు, బండరాళ్లు పడటంతో 17 మంది దుర్మరణం చెందారు. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
కుంభవృష్టి కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా (Gov. Cesar Limbaya Mbangisa) తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రావిన్స్ అంతటా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.
Here's News
At least 17 people killed after a landslide caused by torrential rains in northwestern DR Congo, say local authorities ⤵️ https://t.co/oN6swTSAYD
— Al Jazeera English (@AJEnglish) September 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)